పుష్ప-2 చిత్రం విడుదల తేదీని అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్నా, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
పుష్ప-1 చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ కు మరింత ఖ్యాతి రావడంతో పాటు, ప్యాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చింది.
వ్యాఖ్యలు (0)
ఈ వార్తకు వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య రాయండి!
వ్యాఖ్య రాయండి